రైతు కుటుంబాలకు బర్రంకుల పీఏసీఎస్ ఆర్థిక సహాయం
కృష్ణా: నాగాయలంక మండలం బర్రంకుల పీఏసీఎస్ కార్యాలయంలో మంగళవారం రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందచేశారు. సొసైటీ సభ్య రైతులు ఆరుగురు ఇటీవల మృతి చెందగా వారి మట్టి ఖర్చుల నిమిత్తం సంఘ సభ్యుల సంక్షేమ నిధి నుంచి రూ.10 వేల చొప్పున రూ.60 వేలు సహాయాన్ని పీఏసీఎస్ ఛైర్మన్ తోట శ్రీనివాసరావు అందచేశారు. కేడీసీసీ బ్యాంకు చీఫ్ మేనేజర్ చింతలపూడి మధుబాబు పాల్గొన్నారు.