ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: RDO
KDP: మొంథా తుఫాన్ నేపథ్యంలో పెన్నానది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ ఆదేశించారు. మంగళవారం సిద్ధవటం మండలంలోని వంతాటిపల్లె బీసీ కాలనీ, పెన్నానది పరివాహక ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ఆకుల తిరుమల బాబు పాల్గొన్నారు.