రైల్వే మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

రైల్వే మంత్రిని కలిసిన ఎమ్మెల్యే

NZB: రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శనివారం కాజీపేటలో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కేంద్ర రైల్వే శాఖ మంత్రితో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, BJP ముఖ్య నేతలు, తదితరులు ఉన్నారు.