VIDEO: పెద్ద వాగు దాటికి ప్రమాదంలో 13 ఇళ్లు

BDK: పినపాక మండలం ఈ బయ్యారం పెద్ద వాగు ప్రవాహానికి పలు ఇళ్లు పూర్తిగా ధ్వంసం కానున్నాయి. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని ఈ బయ్యారం ప్రధాన రహదారి పక్కనే ఉన్న 13 ఇళ్లు వాగు ప్రవాహానికి కొట్టుకుపోనున్నాయి. వాగు దాటికి ఇంటి పిల్లర్లు బయటపడ్డాయి. పెను ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.