రాజేంద్రప్రసాద్ నేటి యువతకు ఆదర్శనీయులు

రాజేంద్రప్రసాద్ నేటి యువతకు ఆదర్శనీయులు

ELR: నూజివీడు మండలం మద్దాయికుంట జడ్పీ హైస్కూల్లో బుధవారం డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ జయంతి వేడుకలు నిర్వహించారు. రాజేంద్రప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసే నివాళి అర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం దారపురెడ్డి భాస్కరరావు మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి చేపట్టి గాంధీజీ అడుగుజాడల్లో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నట్లు వివరించారు. రాజేంద్రప్రసాద్ నేటి యువతకు ఆదర్శనీయమన్నారు.