బేతంచెర్లలో సీపీఐ సీపీఎం నాయకులు నిరసన
NDL: బేతంచెర్ల పట్టణంలో సీపీఐ సీపీఎం నాయకులు నిరసన చేపట్టారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రవిభజన హామీలను నెరవేర్చాలని సీపీఐ సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ వరకు వారు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈనెల16న జిల్లాలో నరేంద్రమోదీ పర్యటనను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు.