అన్నక్యాంటీన్‌లో అధికారుల ఆకస్మిక తనిఖీ
VSP: విశాఖలోని ఎంవీపీ కాలని రైతుబజార్ వద్ద అన్న క్యాంటీన్‌ను ఏడీసీ నల్లనయ్య, ఏఎంఓహెచ్ ప్రసాదరావు శనివారం తనిఖీ చేశారు. భోజన నాణ్యత, వంటశాల పరిశుభ్రతను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు, వినియోగదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకూడదని, పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలని నిర్వాహకులను నల్లనయ్య ఆదేశించారు.