video: బారువా లో వైభవంగా గ్రామ దేవత ఉత్సవాలు

SKLM: సోంపేట మండలం బారువా గ్రామంలో గ్రామ దేవత ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ మేరకు గ్రామ దేవత ప్రతిరూపాలు గ్రామ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా మహిళల తీన్మార్, జాలరి నాటకం, తదితర అంశాలు ప్రేక్షకులను అలరించాయి. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.