ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
ELR: చింతలపూడిలో ఆర్టీసీ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆదివారం ఉదయం చింతలపూడి నుంచి నూజివీడు వెళుతున్న బస్సును స్థానికంగా ఉన్న రైస్ మిల్లులో హెవీ లోడ్‌తో ఉన్న లారీ వెనుక నుంచి ఢీకొంది. బస్సు డ్రైవర్ అప్రమత్తతతో ఎవరికి గాయాలు కాలేదని ప్రమాణికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు వెనుక భాగం పాక్షికంగా దెబ్బతింది.