గత ప్రభుత్వంలో బిల్లులు రాలేదని సర్పంచుల ఆవేదన
MHBD: గత ప్రభుత్వంలో అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాక సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో, ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో రిజర్వేషన్లు అనుకూలంగా ఉన్నా, నాయకులు మళ్ళీ పోటీ చేయాలా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. ఖర్చు చేసిన సొమ్ము తిరిగి వస్తుందో రాదోనని, గెలుస్తామో గెలవమోనని వారు భయపడుతున్నారు. జిల్లాలో 482 పంచాయతీలు ఉన్నాయి.