VIDEO: డంపింగ్ యార్డ్‌తో తీవ్ర ఇబ్బంది

KNR: కరీంనగర్ పట్టణంలోని డంప్ యార్డ్ వల్ల తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన నివార్షి అనే చిన్నారి అధికారులను వీడియో ద్వారా ప్రశ్నించింది. వేరే ఊరులో ప్రజలు హాయిగా ఉన్నారని, కరీంనగర్‌లోనే డంప్ యార్డ్ పొగ వల్ల ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారని, చాప కింద నీరులాగా కరీంనగర్ మొత్తం పొగ వ్యాప్తి చెందిన కూడా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.