RMPలు నిబంధనలు మీరితే చర్యలు

KMM: జిల్లాలో ఆర్ఎంపీలు నిబంధనలు అతిక్రమించి వైద్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని DMHO బానోతు కళావతి భాయ్ హెచ్చరించారు. ఆర్ఎంపీలు నిబంధనల మేరకు ప్రథమ చికిత్సలు మాత్రమే చేయాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.