గాంధీ ఆశ్రమంలో సర్వమత ప్రార్థనలు

NLR: ఇందుకూరుపేట మండలంలోని పల్లిపాడు పినాకిని గాంధీ ఆశ్రమంలో ఆదివారం సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. మహాత్మా గాంధీ విగ్రహానికి, ఆశ్రమ స్థలదాత పోనక కనకమ్మ విగ్రహానికి పట్టు వస్త్రం, నూలు మాల సమర్పించారు. అనంతరం ఆశ్రమ కమిటీ సభ్యులు గంపల మంజుల విద్యార్థులకు ఆశ్రమ స్థల దాత, స్వాతంత్య్ర సమరయోధురాలు పోనక కనకమ్మ జీవిత విశేషాల గురించి వివరించారు.