అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం
కృష్ణా: ఢిల్లీ నగరంలో జరిగిన పేలుళ్ల ఘటనలో భాగంగా కృష్ణా జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లావ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు నెలకొనకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. సోమవారం రాత్రి బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రదేశాలు, మాల్స్, పబ్లిక్ గ్యాదరింగ్ ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు నిన్వహించారు. డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టారు.