మధురవాడలో రేపు విద్యుత్తు సరఫరా నిలిపివేత
VSP: మధురవాడ సబ్ స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా నిలిపివేస్తున్నట్లు జోన్-3 ఎగ్జిక్యూట్ ఇంజినీర్ బి.సింహా చలంనాయుడు తెలిపారు. మధురవాడ ఏరియా పరిసర ప్రాంతాలు MSR లేఔట్, ఉజ్వల హాస్పిటల్, సాయి ప్రియా లేఔట్, వల్లీనగర్ తదితర ప్రాంతాలకు సరఫరా ఉండదన్నారు.