VIDEO: ద్విచక్ర వాహనాలను దగ్ధం చేసిన దుండగులు

KKD: పట్టణంలోని సాంబమూర్తినగర్ తోట అమ్మవారి వీధిలో గుర్తు తెలియని దుండగులు నాలుగు ద్విచక్ర వాహనాలను మంగళవారం రాత్రి దగ్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాకినాడ 3 టౌన్ పోలీసులు సంఘటన బుధవారం సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. గత వారం రోజులుగా రేచర్లపేట, సాంబమూర్తి నగరంలో వాహనాలు దహనం ఘటనలు జరుగుతూనే ఉన్నాయని స్థానికులు తెలిపారు.