ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకోవాలి: మండిపల్లి

ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకోవాలి: మండిపల్లి

AP: ఇష్టానుసారంగా వాణిజ్య సరుకులు, అధిక లోడ్‌తో ఉన్న ప్రైవేట్ బస్సులపై చర్యలు తీసుకోవాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 976 బస్సులను తనిఖీ చేశామన్నారు. సరైన పత్రాలు లేని 193 బస్సులపై కేసులు, జరిమానాలు విధించినట్లు తెలిపారు.  భద్రతా నియమాల ఉల్లంఘనలపై కఠిన చర్యకు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.