జాతర ఉత్సవాల్లో హెల్త్ క్యాంప్
SRD: మనూరు మండలం బోరంచ నల్ల పోచమ్మ ఆలయం జాతర సందర్భంగా స్థానికంగా ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మేరకు స్థానిక ఎస్సై కోటేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండుటెండల్లో జాతరకు వచ్చిన భక్తుల ఆరోగ్యం మెరుగుపరిచేందుకు వైద్య పరీక్షలు, చికిత్సలు చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. స్థానికంగా ఈ క్యాంపు ఎంతో అవసరమని ఎస్సై చెప్పారు.