BREAKING: ఛార్‌ధామ్ యాత్ర నిలిపివేత

BREAKING: ఛార్‌ధామ్ యాత్ర నిలిపివేత

ఉత్తరాఖండ్‌లో సాగుతున్న ఛార్‌ధాయ్ యాత్ర నిలిచిపోయింది. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో యాత్రని నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు యాత్ర సాగదని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బద్రినాథ్, కేథార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రిలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఆ ప్రాంతాల్లో హెలికాప్టర్ సేవలను కూడా కేంద్రం నిలిపివేసింది.