'విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి'

వికారాబాద్: ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కుల్కచర్ల ఎంపీడీఓ రామకృష్ణ సూచించారు. కుల్కచర్లలోని గురుకుల పాఠశాలను సందర్శించిన ఆయన విద్యార్థులకు రాత్రిపూట అందిస్తున్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. వర్షాల నేపథ్యంలో విద్యార్థులను జాగ్రత్తగా చూసుకోవాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సిబ్బందికి సూచించారు.