విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

NDL: కోసిగి మండలం సాతనూరు కొట్టాలలో విద్యార్థుల విద్య కాకుండా ప్రాణాలు కూడా ప్రమాదంలో పడ్డాయి. శిథిలావస్థకు చేరిన పాఠశాల భవనంలో ఇనుప రాడుపై ఆధారపడుతూ తరగతులు నిర్వహిస్తున్నారు. పైకప్పు భాగం ఇప్పటికే కూలిపోయింది. ఎప్పుడు మరింత కూలుతుందోనని విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.