రైలు ఢీకొని వృద్ధుడు మృతి
MBNR: బాలానగర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో గురువారం రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ మల్లేశ్వర్ వివరాల ప్రకారం.. చిన్నరేవల్లి గ్రామానికి చెందిన పుల్లని చిన్న పెంటయ్య(70) ఇంటి నుంచి వెళ్లి బ్రిడ్జి వద్ద పట్టాలు దాటుతుండగా చంగల్‌పట్టు రైలు ఢీకొంది. ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా, కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.