సర్పంచ్ ఆధ్వర్యంలో మరమ్మత్తుల పనులు

సర్పంచ్ ఆధ్వర్యంలో మరమ్మత్తుల పనులు

SKLM: బూర్జ మండలం తోటవాడ గ్రామపంచాయతీలో త్రాగునీటి బోరు మరమ్మత్తుల పనులను సోమవారం నిర్వహించినట్లు స్థానిక సర్పంచ్ సూర ఆనందరావు తెలిపారు. నిర్వహణ పనుల్లో భాగంగా వేసవిలో త్రాగునీటి ఇబ్బంది కలగకుండా స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు త్రాగునీటి బోర్లు మరమ్మత్తులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే విద్యుత్ స్తంభాలకు కొత్త వీధి దీపాలను వేయించామన్నారు.