లయన్స్ ఆస్పత్రిలో ధరిత్రీ దినోత్సవం
విశాఖలోని లయన్స్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో బుధవారం ధరిత్రీ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ డా. వెలగపూడి ఉమామహేశ్వరరావు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని, నీరు-విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొని మొక్కలు నాటి ప్రతిజ్ఞ చేశారు.