రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలకు గాయాలు
కర్నూలు: కోసిగి మండలం వందగల్లు గ్రామ శివార్లలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కౌతాళం మండలంలోని కరణి గ్రామానికి చెందిన యల్లమ్మ, సుశీలమ్మ తీవ్రంగా గాయపడ్డారు. కోసిగికి ఆటోలో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టెంపో ఢీకొన్నట్లు తెలిపారు. ఢీకొన్న ఘటనలో యల్లమ్మకు చేయి విరగగా.. సుశీలమ్మకు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు.