VIDEO: ఖమ్మం కార్పొరేషన్ ఎదుట వీధి వ్యాపారుల ఆందోళన
ఖమ్మం పాత బస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వీధి వ్యాపారుల కేంద్రంలో స్థానిక పేదలకు, వికలాంగులకు వ్యాపారం చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట మంగళవారం బాధితులు ఆందోళన చేపట్టారు. షాపుల కేటాయింపు కోసం లక్కీ డ్రా నిర్వహించకపోవడంతో వారంతా నిరసన తెలిపారు. ఒకే వర్గానికి షాపులు కేటాయించడం సరైంది కాదని అన్నారు.