VIDEO: 'కాళికామాత దేవాలయంలో కార్తీకమాస ఉత్సవాలు'
MDK: వెల్దుర్తి మండలం మన్నె వారి జలాల్పూర్ గ్రామంలోని శ్రీ మహంకాళి మాత దేవాలయంలో కార్తీకమాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా కార్తీక మాసం సోమవారం పురస్కరించుకుని 360 మృతిక లింగాలకు పంచామృత అభిషేకాలు జరిపారు. గణపతి హోమం, పుణ్యాహవాచనం కార్యక్రమాలతో పాటు శ్రీ కాళికామాతకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహించారు.