మూసీకి తగ్గిన ఇన్ ఫ్లో..

NLG: మూసీ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద ఉధృతి తగ్గింది. మూసీ రిజర్వాయరు శుక్రవారం 3,498 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వచ్చింది. దీంతో ప్రాజెక్టు అధికారులు ఒక క్రస్టు గేటును రెండు అడుగుల మేర పైకెత్తి 1230 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కుడి, ఎడమ ప్రధాన కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 527 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.