'ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చొద్దు'
KRNL: ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే కుట్రలను మానుకోవాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నబి రసూల్ డిమాండ్ చేశారు. కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన సవరణ బిల్లు, చట్టం పేరు మార్చడానికి కాదని, మహాత్మా గాంధీ పేరును ఉద్దేశపూర్వకంగా తొలగించడానికి చేస్తున్న కుట్రేనని ఆయన అన్నారు. దీంతో గ్రామీణ పేదలకు ఉపయోగపడే చట్టం పథకంగా మారే ప్రమాదం ఉందని తెలిపారు.