ఈనెల 12న ప్రవేశ పరీక్ష

ఈనెల 12న ప్రవేశ పరీక్ష

VZM: ఈనెల 12న వేపాడ మండలం బక్కునాయుడుపేట ఆదర్శ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు పరీక్ష జరగనున్నట్లు ప్రిన్సిపల్ ఆర్ ఈశ్వరరావు శుక్రవారం తెలిపారు. పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులు హాల్ టికెట్‌తో పాటు గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు. వెబ్‌సైట్ ద్వారా హాల్ టికెట్ తీసుకోని విద్యార్థులు తమ పాఠశాలలో శనివారం హాల్ టికెట్ పొందాలని కోరారు.