శివలింగాన్ని తాగిన సూర్య కిరణాలు

అనంతపురం జిల్లాలో రెండు నదుల శివక్షేత్రంగా పిలవబడుతూ.. విరాజిల్లుతోన్న తాడిపత్రిలో చిన్నపోలమడలోని ఉమామహేశ్వర దేవస్థానంలో శివలింగాన్ని సూర్యకిరణాలు తాకాయి. మాసపౌర్ణమి తర్వాత వచ్చే 2, 3 రోజుల ఉదయం పాటు సూర్యకిరణాలు స్వామి వారిని తాకుతాయని అర్చకులు తెలిపారు. శ్రీకృష్ణదేవరాయలు కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించారు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు భక్తులు బారులు తీరారు.