'అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలి'

RR: మన్సురాబాద్ డివిజన్ పరిధిలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలను కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లపై పొంగిపొర్లుతున్న డ్రైనేజీ, మురుగునీరు సమస్యపై అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తక్షణమే పరిష్కరించాలన్నారు.