'కండీషన్ లేని బస్సులను సీజ్ చేయాలి'

ATP: కండీషన్లు లేని బస్సులు నడిపి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ మంగళవారం ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో గుంతకల్లు ఆర్డీఓ రాజబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కండిషన్లు లేని బస్సులను సీజ్ చేసి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.