న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా సూర్యాపేటలో ఆందోళన

న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా సూర్యాపేటలో ఆందోళన

సూర్యాపేట: చేవెళ్ల మహిళా న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ సూర్యాపేట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు. సూర్యాపేట కోర్టు ముందు ఆందోళన చేపట్టారు. తక్షణమే 'న్యాయవాదుల పరిరక్షణ చట్టం' తీసుకురావాలని గుంటూరు మధు, వసంత సత్యనారాయణ డిమాండ్ చేశారు. కక్షిదారుల కోసం పనిచేసే తమకే రక్షణ లేకపోవడంపై వారు ఆవేదన వ్యక్తం చేశారు.