వార్డు సభ్యులకు శిక్షణ
GDWL: కేటీదొడ్డి మండలంలోని వార్డు సభ్యులకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల 9 నుంచి 13 వరకు ఓరియంటేషన్ శిక్షణ నిర్వహించనున్నారు. మండల కేంద్రంలో జరిగే ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ చట్టం, గ్రామపాలన, గ్రామసభ నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలపై అవగాహన కల్పిస్తారు. మండలంలోని 102 మంది వార్డు సభ్యులు పాల్గొననున్నారు.