అనకాపల్లి బెల్లానికి ప్రత్యేక గుర్తింపు

అనకాపల్లి బెల్లానికి ప్రత్యేక గుర్తింపు

అనకాపల్లి బెల్లానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. గురువారం స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన వాణిజ్య ప్రముఖుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. జీఎస్టీ మార్పులు గురించి వ్యాపారస్తులు సూచనలను నేరుగా తెలియ చేయవచ్చునన్నారు. ప్రధాని కూడా స్థానిక వ్యాపారుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలని కోరినట్లు పేర్కొన్నారు.