సైబర్ నేరగాళ్ల వల.. నగదు మాయం
RR: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి ఓ యువతి, మరో మహిళ సుమారు రూ. 1.59 లక్షల నగదు పోగొట్టుకున్న సంఘటనలు నాంపల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సీహెచ్ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. నాంపల్లి శాంతినగర్ ప్రాంతానికి చెందిన ఓ యువతి ఆన్‌లైన్ ఉద్యోగం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన లింక్‌ను క్లిక్ చేసింది. దీంతో ఆమె బ్యాంక్ నుంచి రూ. 90వేలు మాయమైనట్లు తెలిపారు.