'యూదుల హనుక్కాను లక్ష్యంగా చేసుకుని'
ఆస్ట్రేలియాలో యూదులు జరుపుకుంటున్న హనుక్కా వేడకలను దుండగులు లక్ష్యంగా చేసుకున్నట్లు అక్కడి పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక యూదులు హాజరయ్యారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్, న్యూసౌత్‌వేల్స్ ప్రీమియర్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు.