VIDEO: ప్రజాక్షేత్రంలో సేవాయజ్ఞం.. ఆటపాటలతో సంక్షేమ సందేశం
GDWL: గద్వాలలోని ఓ గార్డెన్‌లో గురువారం ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. కళాకారులు ఆలపించిన సంక్షేమ గీతాలు, ఆటపాటలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేశాయి. పల్లె ప్రగతి, ప్రభుత్వ పథకాల అమలుపై సాగిన ఈ సాంస్కృతిక ప్రదర్శన ప్రజాప్రతినిధులను విశేషంగా ఆకట్టుకుంది. జిల్లాలోని 255 పంచాయతీల సర్పంచులు హాజరయ్యారు.