పులగుర్తలో టీడీపీలోకి చేరికలు

తూ.గో: అనపర్తి మండలం పులగుర్తలో బుధవారం తెలుగుదేశం పార్టీలోకి సుమారు 200 మంది వైసీపీ నాయకులు చేరారు. వారికి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పసుపు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..వైసీపీ ప్రభుత్వ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు.