శ్రీరామ శోభాయాత్రకు మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

శ్రీరామ శోభాయాత్రకు మాజీ ఎమ్మెల్యేకు ఆహ్వానం

RR: షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలును హిందూ వాహిని సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. షాద్‌నగర్‌లో ఈనెల 27న హిందూ వాహిని ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీరామ శోభాయాత్ర కార్యక్రమానికి రావాల్సిందిగా మాజీ ఎమ్మెల్యేను ఆహ్వానించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకొని నిర్వహించే శ్రీరామ శోభాయాత్రలో పాల్గొనడం తనకు ఎంతో సంతోషదాయకమని మాజీ ఎమ్మెల్యే పేర్కొన్నారు.