REQUEST: వందేమాతరం DP పెట్టండి

AP: భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల వేళ దేశ ప్రజలకు మంత్రి లోకేష్ కీలక విజ్ఞప్తి చేశారు. 'భారత్ సమగ్రతను దెబ్బతీయాలని శత్రుదేశం కుట్రలు పన్నుతున్న వేళ.. మనందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంకేతంగా మీ ఫేస్‌బుక్, ఇన్‌స్టా, వాట్సాప్ తదితర సోషల్ మీడియా అకౌంట్లలో వందేమాతరం అనే DPని పెట్టుకోండి. వందేమాతరమంటూ నినదించండి' అని కోరారు.