ఆర్టీసీలో తాత్కాలిక సిబ్బంది నియామకం: DM

ఆర్టీసీలో తాత్కాలిక సిబ్బంది నియామకం: DM

KMM: ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్ట్యా ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు మధిర డిపో మేనేజర్ రామయ్య తెలిపారు. తాత్కాలిక ప్రాతిపదికన డ్రైవర్, కండక్టర్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెంటనే డిపో కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.