రక్తదానంను మహా గొప్పదానం: కలెక్టర్

KMR: రక్తదానంను మహా గొప్పదానంగా ఉద్యోగులు భావించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో శనివారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలో ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. 36 మంది రక్తదానం చేయడం అభినందనీయమని కొనియాడారు. జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ రాజన్న, కార్యదర్శి రఘుకుమార్, ఉద్యోగులు పాల్గొన్నారు.