సిల్వర్ మెడల్ సాధించిన కిల్లక లలిత
PPM: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం వేదికగా మార్చి8 నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో మన్యం జిల్లాకు చెందిన పారా క్రీడాకారిణి కిల్లక లలిత సత్తా చాటారు. T-11 కేటగిరికి సంబందించి 400 మీటర్లు పరుగులో అద్భుతమైన ప్రతిభ కనబరచి సిల్వర్ మెడల్ సాధించిందని అసోసియేషన్ అధ్యక్షులు కె. దయానంద్ తెలిపారు.