విషాదం.. కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

విషాదం..  కరెంట్ షాక్‌తో వ్యక్తి మృతి

NLR: కలిగిరి మండలం దూబగుంట గ్రామంలో విద్యుత్ షాక్ తగిలి వర్దినేని శ్రీనివాసులు ఆదివారం మృతి చెందారు. ట్రాన్స్ ఫార్మర్ వద్ద కరెంటు పోయిందని ఉద్దేశంతో త్రీ ఫేస్ కరెంటు స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్న సమయంలో విద్యుత్ షాక్ తగిలింది. 108 సాయంతో కలిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ బిజ్జం గీతారెడ్డి ధ్రువీకరించారు.