డిప్యూటీ సీఎంతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్
MHBD: ఏప్రిల్ 2 నుంచి గ్రామసభలు పెద్దఎత్తున నిర్వహించాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, జూన్ 2 నుంచి అమలు చేయబోతున్న కొత్త పథకాల గురించి వివరించాలని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. 'ప్రజాపాలన -ప్రజా ప్రణాళిక' పై జిల్లా కలెక్టర్లతో మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిచారు. ఈ వీసీలో జిల్లా కలెక్టర్, అధికారులు పాల్గొన్నారు.