కేంద్రమంత్రికి బెదిరింపు కాల్

కేంద్రమంత్రికి బెదిరింపు కాల్

కేంద్రమంత్రి, RLD అధినేత జయంత్ చౌదరికి బెదిరింపు కాల్ రావటం కలకలం రేపింది. కేంద్రమంత్రి పీఏకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేసి జయంత్‌ను హత్య చేస్తామని హెచ్చరించాడు. ఈ ఘటనపై పీఏ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రిపై ముందుగా నిఘా లేదా గూఢచర్యం జరిగి ఉండొచ్చని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై పోలీసులు విచారిస్తున్నారు.