'పోలేరమ్మ జాతరను ప్రజలు మెచ్చేలా నిర్వహించాలి'
TPT: నాయుడుపేట పట్టణంలోని గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ జాతరను ప్రజలు మెచ్చేలా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలంటూ మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం సూచనలు చేశారు. పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఆలయ కమిటీ ఛైర్మన్ నానబాల సుబ్బారావు, కమిటీ సభ్యులు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.