నేడు నెల్లిమర్ల ఎమ్మెల్యే పర్యటన వివరాలు
VZM: నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి శుక్రవారం ఉదయం 10:30 గంటలకు అక్కివరం గ్రామంలో ఏపీ మోడల్ స్కూల్లో "మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ 2025" కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం 12:30కి పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్ వద్ద క్యూబ్ ఫాషన్స్ షాప్ ప్రారంభోత్సవంలో పాల్గొంటారని ఎమ్మెల్యే కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి.